కర్ణాటక మంత్రి సతీశ్ జార్కిహోలీ ఇళ్లలో ఈడీ సోదాలు

రిపోర్టర్: రమేష్ స్థలం: కర్ణాటక

కర్ణాటక మంత్రి సతీశ్ జార్కిహోలీ, ఆయన కుమార్తె ఎంపీ ప్రియాంకా జార్కిహోలీ నివాసాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. ఆస్తులకు సంబంధించిన కేసులో బెంగళూరు, బెల్గావితో పాటు మొత్తం 18 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు కొనసాగుతున్నాయి. మంత్రి కుటుంబసభ్యులు, సన్నిహితుల వ్యాపార సంస్థలు, ఇళ్లలో ఈడీ అధికారులు తనిఖీలు చేపట్టి కీలక పత్రాలను పరిశీలిస్తున్నారు.