రాజాపేటలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు
రిపోర్టర్: K.Shekhar
స్థలం: రాజాపేట
యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల కేంద్రంలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 111వ జయంతి వేడుకలను పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నాయకులు నివాళులర్పించారు. తెలంగాణ ఉద్యమంలో త్యాగాలు చేసిన మహనీయుడని, సహకార సంఘాల పితామహుడని పలువురు సంఘ నేతలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల ప్రతినిధులు, సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.