పర్యాటకులకు గుడ్ న్యూస్: డెబ్బై రోజుల తర్వాత పాపికొండల విహారయాత్ర పునఃప్రారంభం
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: Alluri Sitharama Raju district
గోదావరి వరద ఉధృతి తగ్గడంతో సుమారు డెబ్బై రోజుల విరామం తర్వాత పాపికొండల విహారయాత్ర మళ్లీ ప్రారంభమైనట్లు రంపచోడవరం సబ్ కలెక్టర్ పృథ్వీరాజ్ కుమార్ తెలిపారు. దసరా సెలవులు మొదలుకావడంతో పర్యాటకులు భారీగా తరలివచ్చే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. బోటు ప్రయాణంలో పర్యాటకులు విధిగా లైఫ్ జాకెట్లు ధరించాలని, భద్రతా ప్రమాణాలు పాటించాలని చింతూరు ఐటీడీఏ పీవో నరేంద్ర పడాల్ స్పష్టం చేశారు. అనుమతులు లభించడంతో పర్యాటక రంగం కళకళలాడుతోంది.