ఎర్రవల్లి భూ సర్వే నివేదికను ప్రభుత్వానికి అందజేయనున్న కలెక్టర్

రిపోర్టర్: సురేష్ స్థలం: సిద్దిపేట

ఎర్రవల్లి భూ సర్వే సమగ్ర నివేదిక సిద్ధమైందని, దీనిని ఇవాళ ప్రభుత్వానికి అందజేయనున్నట్లు జిల్లా కలెక్టర్ హైమావతి తెలిపారు. బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఫామ్హౌస్ ఉన్న ఎర్రవల్లితో పాటు వెలికట్ట గ్రామాల్లో రెవెన్యూ అధికారులు భారీ బందోబస్తు మధ్య సర్వే పూర్తి చేశారు. సర్వే నంబర్ 325లో 388 ఎకరాలకు సంబంధించి వందలాది మంది అనుభవదారులకు నోటీసులు జారీ చేశారు. స్థానిక ప్రజల అభ్యంతరాలను పక్కనపెట్టి నివేదిక రూపొందించారనే ప్రచారంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.