'పోరాటాలు ఎర్రజెండాలు చేస్తే.. చట్టం చేసింది మూడు రంగుల జెండా': సీఎం రేవంత్ రెడ్డి

రిపోర్టర్: రాజేష్ స్థలం: Hyderabad

భూమి విముక్తి కోసం అప్పట్లో ఇందిరా గాంధీ, పీవీ నరసింహారావు అగ్రికల్చర్ సీలింగ్ చట్టాన్ని తెచ్చారని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో స్పష్టం చేశారు. కొద్దిమంది చేతుల్లో బందీగా ఉన్న భూములకు విముక్తి కల్పించడంలో కాంగ్రెస్ పాత్ర చరిత్రాత్మకమని పేర్కొన్నారు. పోరాటాలు ఎర్రజెండాలు చేస్తే, ఆ పోరాటాలకు చట్టరూపం మాత్రం మా మూడు రంగుల జెండా, మా కాంగ్రెస్ జెండా తెచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి సభలో ఘంటాపథంగా తేల్చిచెప్పారు.