కోనసీమ జిల్లాలో సముద్రంలో మునిగిన మత్స్యకారుల బోటు
రిపోర్టర్: శివ
స్థలం: భైరవపాలెం, కోనసీమ జిల్లా
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా భైరవపాలెం మొగలో మత్స్యకారుల బోటు ప్రమాదానికి గురైంది. భైరవపాలెం గ్రామానికి చెందిన చింత శ్రీనుకు చెందిన బోటుపై తొమ్మిది మంది మత్స్యకారులు వేటకు వెళ్లారు. తెల్లవారుజామున ఒక్కసారిగా ఈదురు గాలులు వీయడంతో బోటు సముద్రంలో మునిగిపోయింది. అప్రమత్తమైన తోటి మత్స్యకారులు మరొక బోటు సహాయంతో రక్షణ చర్యలు చేపట్టడంతో ప్రాణాపాయం తప్పింది.