నల్లసముద్రంలో వాణిజ్య నౌకపై క్షిపణి దాడి: ముగ్గురు భారతీయులకు గాయాలు

రిపోర్టర్: శివ స్థలం: రొమేనియా

నల్లసముద్రం గుండా ప్రయాణిస్తున్న ఎంవీ రోయాద్ మమ్మాడోవ్ అనే వాణిజ్య నౌకపై జరిగిన భీకర దాడిలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, ముగ్గురు భారతీయులకు తీవ్ర గాయాలైనట్లు రొమేనియాలోని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రులకు తరలించి మెరుగైన వైద్యం అందిస్తున్నామని, రాయబారి మనోజ్ మహాపాత్ర వారి ఆరోగ్య పరిస్థితిని ఫోన్ ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తూ బాధితులకు పూర్తి అండగా ఉంటామని భరోసా ఇచ్చినట్లు అధికారులు స్పష్టం చేశారు.