జూనియర్ ఆసియా కప్ హాకీలో భారత్ ఘన విజయం

రిపోర్టర్: హరి స్థలం: భారతదేశం

జూనియర్ ఆసియా కప్ హాకీ టోర్నీ ఫైనల్లో దక్షిణ కొరియాపై భారత్ 4-1 తేడాతో అద్భుత విజయం సాధించింది. వరుసగా నాలుగోసారి ట్రోఫీని కైవసం చేసుకుని సత్తా చాటింది. ఈ విజయంతో భారత్ జూనియర్ ప్రపంచకప్‌నకు అర్హత సాధించింది. అజిత్ యాదవ్, అన్మోల్, ప్రభ్‌దీప్ సింగ్, అషు మౌర్య గోల్స్ చేసి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించారు.