ఢిల్లీ హోటల్ ఘటనపై స్పందించిన మంత్రి దామోదర రాజనర్సింహ వ్యాఖ్యలు కలకలం

రిపోర్టర్: వెంకట్ స్థలం: ఢిల్లీ

కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు కొత్తేమీ కాదని తెలంగాణ మంత్రి దామోదర రాజనర్సింహ స్పష్టం చేశారు. ఢిల్లీలోని ఓ హోటల్ లో ఇటీవల చోటుచేసుకున్న గొడవపై ఆయన మీడియాకు స్పందించారు. పార్టీలో అంతర్గతంగా జరిగే పరిణామాలు వేరుగా ఉంటాయని, బయటకు ప్రచారం జరిగే విషయాలు మరోలా ఉంటాయని ఆయన అభిప్రాయపడ్డారు. రాజకీయాల్ లో నాయకుల మధ్య పరస్పర నమ్మకం, సమన్వయం అత్యంత కీలకమని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.