చిట్వేల్ ఎంపీటీసీ అభ్యర్థిగా శ్రీకుల బాలాజీని ఖరారు చేసిన వైఎస్సార్సీపీ
రిపోర్టర్: సిటిజెన్ పోస్ట్
స్థలం: చిట్వేల్
తిరుపతి జిల్లా చిట్వేల్ మండలం సిఎం రాచపల్లి సెగ్మెంట్ వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీ అభ్యర్థిగా శ్రీకుల బాలాజీని పార్టీ అధిష్టానం అధికారికంగా ఖరారు చేసింది. ఈ సందర్భంగా ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు. మండలంలో ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తానని గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతామని ఆయన స్పష్టం చేశారు.