వైకాపా అరాచకాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు
రిపోర్టర్: సునీల్
స్థలం: Undavalli
ఆంధ్రప్రదేశ్లో శాంతిభద్రతల సమస్యలు వైకాపా నుంచే ఉత్పన్నమవుతున్నాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ఉండవల్లిలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో విధ్వంసం పరాకాష్ఠకు చేరిందని ధ్వజమెత్తారు. స్థానిక సంస్థల ఎన్నికలను అడ్డుకునేందుకు వైకాపా కుట్రలు పన్నుతోందని మండిపడ్డారు. హింసాత్మక ఘటనలతో కూడిన ప్రత్యేక బుక్లెట్ను ఈ సందర్భంగా సీఎం విడుదల చేశారు.