కత్తిపూడి ఘోర రోడ్డు ప్రమాదం: భవానీ భక్తుల మృతికి డ్రైవర్ అతివేగమే కారణం
రిపోర్టర్: సురేష్
స్థలం: కాకినాడ
కాకినాడ జిల్లా కత్తిపూడి వద్ద గురువారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్ తీవ్ర నిర్లక్ష్యం మరియు అతివేగమే ప్రాణనష్టానికి ప్రధాన కారణమని స్పష్టమవుతోంది. భవానీ భక్తుల ప్రాణాలను బలిగొన్న ఈ దుర్ఘటనపై స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిబంధనలను విస్మరించి రాష్ డ్రైవింగ్ చేయడం వల్లే ఈ భారీ విషాదం చోటుచేసుకుందని బాధితుల కుటుంబాలు ఆరోపిస్తున్నాయి.