వైఎస్సార్సీపీ నేత కాకుమాను రాజశేఖర్ మృతి పట్ల జగన్ దిగ్భ్రాంతి

రిపోర్టర్: భాస్కర్ స్థలం: అంధ్రప్రదేశ్

వైఎస్సార్సీపీ ప్రచార విభాగం రాష్ట్ర అధ్యక్షుడు కాకుమాను రాజశేఖర్ ఆకస్మిక మృతి చెందడం పట్ల పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణం పార్టీకి, తనకు వ్యక్తిగతంగా ఎప్పటికీ పూడ్చలేని లోటు అని పేర్కొన్నారు. రాజశేఖర్ ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తూ, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ మనోధైర్యాన్ని ప్రసాదించాలని కోరారు.