'పీరియాడిక్ హిస్టారికల్ డ్రామాగా రామ్‌చరణ్ సినిమా': ఓంరౌత్‌తో చర్చలు
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: హైదరాబాద్
అగ్ర హీరో రామ్‌చరణ్ తదుపరి ప్రాజెక్టులకు సంబంధించి ఫిల్మ్‌నగర్‌లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇప్పటికే సుకుమార్ దర్శకత్వంలో సినిమా ఖరారు కాగా, తాజాగా బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ చెప్పిన పీరియాడిక్ హిస్టారికల్ డ్రామా కథకు రామ్‌చరణ్ సానుకూలంగా స్పందించినట్లు సమాచారం వస్తోంది. అయితే ఈ క్రేజీ కాంబినేషన్‌కు సంబంధించి చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన వెలువడితేనే పూర్తి స్పష్టత రానుంది.