అసెంబ్లీ సమావేశాలకు కొండా సురేఖ హాజరుపై తీవ్ర ఉత్కంఠ

రిపోర్టర్: నరేష్ స్థలం: తెలంగాణ

తెలంగాణ శాసనసభ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన వేళ మాజీ మంత్రి కొండా సురేఖ హాజరుపై రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మంత్రివర్గం నుంచి బర్తరఫ్ తర్వాత తొలిసారి సమావేశాల మొదటి రోజు ఆమె హాజరుకాలేదు. మంత్రి పదవి కోల్పోవడంతో సాధారణ ఎమ్మెల్యేగా వెనక వరుసలో ఆమెకు సీటు కేటాయించారు. ఆమె సభకు వస్తారా లేదా అన్నదానిపై సర్వత్రా ఆసక్తి వ్యక్తమవుతోంది.