ప్రకృతి అద్భుతం.. ఎండిన మర్రి చెట్టుపై పెరుగుతున్న తాటి చెట్టు!
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: లక్నేపల్లి
వరంగల్ జిల్లా లక్నేపల్లి శివారులో ప్రకృతి వైచిత్ర్యం చూపరులను ఆశ్చర్యపరుస్తోంది. పూర్తిగా ఎండిపోయిన ఒక మర్రి చెట్టుపై తాటి మొక్క సజీవంగా, పచ్చగా ఎదుగుతోంది. మర్రి కొమ్మల మధ్య నుంచి మొలిచిన ఈ తాటి చెట్టు, ఏళ్లుగా అదే చెట్టును ఆసరాగా చేసుకుని పెరుగుతోంది.
'నాకేమైనా పర్వాలేదు.. నిన్ను మాత్రం బతికిస్తా' అన్నట్లుగా కనిపిస్తున్న ఈ దృశ్యం ప్రకృతి గొప్పతనానికి నిదర్శనంగా నిలుస్తోంది. ఎండిన చెట్టును ఆసరాగా చేసుకుని ప్రాణం పోసుకున్న ఈ తాటి చెట్టును చూసేందుకు స్థానికులు ఆసక్తి చూపుతున్నారు.