సింగరేణి సంస్థను నాశనం చేస్తున్నారంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎమ్మెల్యే వివేకానంద ఫైర్

రిపోర్టర్: భాస్కర్ స్థలం: Hyderabad

కాంగ్రెస్ ప్రభుత్వ పాలనా వైఫల్యాలు, చేతగానితనం వల్ల చారిత్రాత్మక సింగరేణి సంస్థ నాశనమైపోతోందని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కె.పి. వివేకానంద తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ తప్పుడు విధానాల కారణంగా సంస్థ ఉనికి ప్రశ్నార్థకంగా మారుతోందని ఆయన ధ్వజమెత్తారు.