కురిసిన వర్షానికి చితికిన కాలనీ డ్రైనేజీ వ్యవస్థ

రిపోర్టర్: Chinukani Yuvaraju స్థలం: చౌటుప్పల్

చౌటుప్పల్ పట్టణంలో శుక్రవారం కురిసిన వర్షానికి 12వ వార్డులోని లోతట్టు ప్రాంతాల్లో డ్రైనేజీ సమస్య తలెత్తింది. ఈ విషయాన్ని 12వ వార్డు కౌన్సిలర్ పాక చిరంజీవి యాదవ్ మున్సిపల్ చైర్పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన చైర్పర్సన్ తాత్కాలిక మరమ్మతులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. సమస్యను ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి దృష్టికి తీసుకెళ్లి శాశ్వత పరిష్కారం చూపుతామని కాలనీ ప్రజలకు భరోసా ఇచ్చారు.