ఎల్లంపల్లి నుంచి మధ్య మానేరుకు గోదావరి జలాల తరలింపు

రిపోర్టర్: గోపి స్థలం: పెద్దపల్లి

శ్రీపాద ఎల్లంపల్లి జలాశయం నుంచి శ్రీ రాజరాజేశ్వర మధ్య మానేరు జలాశయానికి గోదావరి జలాల తరలింపు కొనసాగుతోందని అధికార వర్గాలు వెల్లడించాయి. నంది మేడారం, గాయత్రి పంప్ హౌస్లలో మోటర్లు నడిపిస్తుండటంతో ఆరువేల మూడొందల క్యూసెక్కుల ప్రవాహం మధ్య మానేరులోకి చేరుతోంది. ఎల్లంపల్లికి వస్తున్న వరదకు అనుగుణంగా నీటిని ఎత్తిపోస్తున్నట్లు అధికారులు తెలిపారు. విద్యుత్ డిమాండ్ పెరగడం, వరద తగ్గడంతో ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు మాత్రమే మోటార్లు ఆపరేట్ చేస్తున్నట్లు స్పష్టం చేశారు.