ఇరువర్గాల రాజీతో సత్వర న్యాయానికి లోక్ అదాలత్ బాసట

రిపోర్టర్: Abdul Azeem స్థలం: ఆమనగల్

రంగారెడ్డి జిల్లా ఆమనగల్ కోర్టు ప్రాంగణంలో జూనియర్ సివిల్ జడ్జి నారం అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో శనివారం లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు సివిల్, క్రిమినల్ కేసులను ఇరువర్గాల సమక్షంలో సామరస్యంగా పరిష్కరించారు. కక్షిదారులు పరస్పర అవగాహన, రాజీ మార్గం ద్వారా సత్వర న్యాయాన్ని పొందాలని న్యాయమూర్తి సూచించారు. ఈ కార్యక్రమంలో కోర్టు సూపరింటెండెంట్ మురళీధర్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ కార్తీక్, బార్ అసోసియేషన్ అధ్యక్షులు అండే కార్ యాదిలాల్, న్యాయవాదులు, బ్యాంకు మేనేజర్లు, పోలీస్ మరియు కోర్టు సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.