తెలంగాణలో రాబోయే రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం

రిపోర్టర్: కిరణ్ స్థలం: Hyderabad

తెలంగాణ వ్యాప్తంగా రాబోయే రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం, ఉత్తర-దక్షిణ ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని అధికారులు స్పష్టం చేశారు. కొన్ని చోట్ల గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే సూచనలు ఉండటంతో ప్రజలు, వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.