కాంగ్రెస్ నేతల భూ దందాలు, ప్రైవేటు ఆస్తులపై దాడులపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్ర ఆగ్రహం

రిపోర్టర్: హరి స్థలం: Hyderabad

తెలంగాణలో కాంగ్రెస్ నాయకులు ప్రైవేటు ఆస్తులపై దాడులు చేస్తూ భూ దందాలకు పాల్పడుతున్నారని బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు. తెలంగాణ భవన్‌లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ ఎంపీలు మల్లు రవి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్ హరీష్ రావు ప్రైవేటు ప్రాపర్టీలపై దాడులకు వెళ్లడం సిగ్గుచేటన్నారు. శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని, రైతులు స్వయంగా జూరాల ప్రాజెక్టు తాళాలు పగలగొట్టి నీళ్లు వదులుకునే దుస్థితికి రేవంత్ రెడ్డి పాలన చేరిందని విమర్శించారు.