న్యాయ వ్యవస్థలో జవాబుదారీతనంపై ఆత్మపరిశీలన అవసరమన్న సుప్రీంకోర్టు ప్రధాన జస్టిస్ సూర్యకాంత్
రిపోర్టర్: శివ
స్థలం: New Delhi
కేరళ హైకోర్టుప్లాటినం జూబ్లీ వేడుకల్ లో సుప్రీంకోర్టు ప్రధాన జస్టిస్ సూర్యకాంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. హైకోర్టుల్ లో పెండింగ్ కేసుల తక్షణ విచారణ కోసం కక్షిదారులు నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించే ధోరణి పెరుగుతోందని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో న్యాయ ప్రక్రియలో జవాబుదారీతనాన్ని మెరుగుపరిచే అంశంపై ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. రాజ్యాంగ న్యాయం కేవలం న్యూఢిల్లీకే పరిమితం కాదని, దేశవ్యాప్తంగా ఉన్న హైకోర్టులే దాని నిజమైన మూలస్తంభాలని ఆయన వెల్లడించారు.