ఉక్రెయిన్ పై రష్యా భీకర దాడి: ఒక్కరోజే ఆరు వందల డ్రోన్లు నేలకూల్చివేత
రిపోర్టర్: సతీష్
స్థలం: మాస్కో
ఉక్రెయిన్ తో జరుగుతున్న భీకర పోరులో రష్యా సంచలన విజయం సాధించింది. ఒక్క రోజులోనే ఏకంగా ఆరు వందల నాలుగు ఉక్రెయిన్ డ్రోన్లను కూల్చివేసినట్లు రష్యా రక్షణ శాఖ ప్రకటించింది. ద్నిప్రాపెట్రోవ్స్క్ ప్రాంతంలో ఉక్రెయిన్ డ్రోన్ దాడిని వోస్టోక్ బలగాలు ధ్వంసం చేశాయని రష్యా అధికారులు స్పష్టం చేశారు. యుద్ధ రంగంలో శత్రు దేశానికి భారీగా ప్రాణ, ఆస్తినష్టం వాటిల్లిందని రష్యా సైన్యం వెల్లడించింది.