స్పెషల్ బస్సులపై 50 శాతం ఛార్జీలు పెంచిన టీజీఎస్ఆర్టీసీ
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: తెలంగాణ
తెలంగాణలో పండుగ రద్దీని ఆసరాగా చేసుకుని ఆర్టీసీ ప్రయాణికులకు తీవ్ర షాక్ తగిలింది. ప్రత్యేక సర్వీసుల పేరుతో సాధారణ రోజుల కంటే ఏకంగా 50 శాతం అదనపు చార్జీలను వసూలు చేస్తున్నట్లు ఆర్టీసీ యాజమాన్యం ప్రకటించింది. హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు నడిచే డీలక్స్, సూపర్ లగ్జరీ, రాజధాని బస్సులపై ఈ పెంపు తక్షణమే అమల్లోకి రానుంది. పండుగ వేళ ప్రయాణికులపై ఆర్టీసీ నిర్ణయం తీవ్ర ఆర్థిక భారాన్ని మోపుతోంది.