మహిళా పారిశ్రామికవేత్తల తయారీకి పెద్దపీట: స్వయం ఏపీ బ్రాండ్ బలోపేతంపై సీఎం చంద్రబాబు

రిపోర్టర్: విజయ్ స్థలం: విజయవాడ

మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా స్వయం ఏపీ బ్రాండ్ను మరింత ముందుకు తీసుకెళ్లనున్నట్లు సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. విజయవాడలో అక్టోబర్ 15 నుంచి 31 వరకు నేషనల్ సరస్ మేళా నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. స్వయం సహాయక సంఘాల ఉత్పత్తులకు జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చేలా అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని అధికారులను ఆదేశించారు.