అమెరికాలోని చికాగోలో కాల్పుల కలకలం ఒకరి మృతి

రిపోర్టర్: సునీల్ స్థలం: World

అమెరికాలోని చికాగో నగరంలో జరిగిన భీకర కాల్పుల ఘటన తీవ్ర కలకలం రేపింది. సౌత్ షోర్ ప్రాంతంలో జరిగిన ఈ కాల్పుల్లో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోగా, ఒక యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ మృతుడు ప్రసిద్ధ రాపర్ హోడీ అని సోషల్ మీడియాలో పెద్దఎత్తున ప్రచారం జరుగుతున్నప్పటికీ, పోలీసులు దీనిని ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న అధికారులు అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు.