సెప్టెంబర్ 9 నుండి సీఏ ఫైనల్ మాక్ టెస్ట్‌లు ప్రారంభం
రిపోర్టర్: వెంకట్
స్థలం: భారతదేశం
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నవంబర్ 2026 సీఏ ఫైనల్ పరీక్షల కోసం మాక్ టెస్ట్ సిరీస్ సెప్టెంబర్ 9 నుండి ప్రారంభం కానుంది. ఈ మాక్ పరీక్షలు రెండు విడతలుగా సెప్టెంబర్ 9 నుండి అక్టోబర్ 5 వరకు ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ విధానాల్లో నిర్వహించనున్నారు. పరీక్ష ముగిసిన 48 గంటల్లోగా ఐసీఏఐ ఆన్సర్ కీలను విడుదల చేయనుంది.