మహాత్మా గాంధీ జయంతి వేళ రాష్ట్రంలో మద్యం దుకాణాలు పూర్తిగా బంద్
రిపోర్టర్: సతీష్
స్థలం: తెలంగాణ
మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ రెండున రాష్ట్రవ్యాప్తంగా డ్రై డే అమల్లో ఉంటుందని ఎక్సైజ్ శాఖ అధికారులు స్పష్టం చేశారు. ఈ మేరకు అన్ని వైన్ షాపులు, బార్లు, పబ్లు మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. నిబంధనలు ఉల్లంఘించి అక్రమంగా మద్యం విక్రయిస్తే కఠినమైన క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటు లైసెన్స్లు రద్దు చేస్తామని అధికారులు హెచ్చరించారు.