గోపి మృతిపై సీబీఐ లేదా సిట్ విచారణ జరపాలి: మంద కృష్ణ మాదిగ
రిపోర్టర్: సతీష్
స్థలం: గుంటూరు
గుంటూరు జిల్లా తాడికొండ మండలం పొన్నెకల్లుకు చెందిన దళిత యువకుడు చీకటి గోపి పోలీసుల అక్రమ నిర్బంధం, చిత్రహింసల వల్లే మృతి చెందాడని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ ఆరోపించారు. తుళ్లూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం చంద్రబాబు స్పందించి సీనియర్ ఐపీఎస్ అధికారితో సిట్ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. బాధితుడి కుటుంబానికి రూ.25 లక్షల పరిహారంతో పాటు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని కోరారు.