ఖమ్మంలో సర్దార్ పటేల్ విగ్రహాన్ని ప్రతిష్టించాలని కలెక్టర్కు బీజేపీ విజ్ఞప్తి

రిపోర్టర్: ఆముదాల వెంకన్న స్థలం: ఖమ్మం అర్బన్

ఖమ్మం నగరంలోని ప్రధాన కూడలిలో సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు వీరవెల్లి రాజేష్ గుప్తా కలెక్టర్ దివాకర టీఎస్‌కు వినతిపత్రం సమర్పించారు. దేశంలోని సంస్థానాలను ఏకం చేసి అఖండ భారత నిర్మాణంలో పటేల్ కీలక పాత్ర పోషించారని తెలిపారు. ఆయన సేవలు భావితరాలకు స్ఫూర్తిదాయకమని పేర్కొంటూ, విగ్రహ ఏర్పాటుకు స్థలం కేటాయించి అనుమతులు మంజూరు చేయాలని కోరారు.