ఫరీదాబాద్ జిమ్ యజమాని నితేష్ యాదవ్ వ్యాపార ఖర్చుల గుట్టురట్టు
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: ఫరీదాబాద్
నెలకు ఇరవై లక్షల రూపాయల అమ్మకాలు జరిగినా జిమ్ నిర్వహణ ఖర్చులు, రుణాల చెల్లింపుల కారణంగా కేవలం రెండు నుండి మూడు లక్షల రూపాయలు మాత్రమే మిగులుతున్నాయని హర్యానా రాష్ట్రం ఫరీదాబాద్ కు చెందిన జిమ్ యజమాని నితేష్ యాదవ్ తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా తన ఫిట్నెస్ సెంటర్ వ్యాపార లావాదేవీలు, నెలవారీ ఖర్చుల వివరాలను ఆయన బహిర్గతం చేయడం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.