సినిమా విశేషాలు: ఇట్లు అర్జున చిత్రానికి సమర్పకుడిగా అక్కినేని నాగార్జున
రిపోర్టర్: అశోక్
స్థలం: హైదరాబాద్
కొత్త టాలెంట్‌ను ప్రోత్సహించడంలో భాగంగానే తాను 'ఇట్లు అర్జున' సినిమాకు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నట్లు అగ్ర నటుడు అక్కినేని నాగార్జున తెలిపారు. అనీష్ హీరోగా మహేష్ ఉప్పల దర్శకత్వంలో వెంకీ కుడుముల ఈ చిత్రాన్ని నిర్మించారని వెల్లడించారు. ఈ నెల 30న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయని, తొలి చిత్రంతోనే హీరో మూగవాడి పాత్రతో ప్రయోగం చేయడం అభినందనీయమని ఆయన ప్రశంసించారు.