శ్రీసత్యసాయి జిల్లాలో భారీ పెట్టుబడి: రూ. 2500 కోట్లతో బీఈఎల్ ప్లాంట్

రిపోర్టర్: మహేష్ స్థలం: శ్రీసత్యసాయి జిల్లా

రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధిని వేగవంతం చేసే దిశగా శ్రీసత్యసాయి జిల్లాలో భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ సంస్థ రూ. 2500 కోట్ల భారీ పెట్టుబడితో రక్షణ రంగానికి సంబంధించిన నూతన ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి నారా లోకేశ్ తెలిపారు. దాదాపు 914 ఎకరాల విస్తీర్ణంలో రూపుదిద్దుకోనున్న ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 800 మంది స్థానిక యువతకు ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆయన స్పష్టం చేశారు.