రామ్ లీలా మైదానం సభపై దుమారం: కృత్రిమ మేధ ఫొటో పోస్ట్ చేశారంటూ కాంగ్రెస్ పై కిరణ్ రిజిజు ధ్వజం

రిపోర్టర్: సతీష్ స్థలం: న్యూఢిల్లీ

రామ్ లీలా మైదానంలో ప్రతిపక్ష ఇండియా కూటమి నిర్వహించిన సభలో జనసందోహాన్ని చూపించేందుకు కాంగ్రెస్ పార్టీ కృత్రిమ మేధ ద్వారా సృష్టించిన నకిలీ చిత్రాన్ని సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేసిందని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణకు చెందిన కాంగ్రెస్ ఎంపీ వంశీ గద్దంతో పాటు పలువురు నేతలు ఈ ఫొటోను షేర్ చేశారని, తప్పుడు కథనాలను సృష్టించడంలో ఆ పార్టీ విఫలమైందని ఆయన మండిపడ్డారు.