రామాపురంలో పల్లె పండగ సభ ఏర్పాట్లను పరిశీలిస్తున్న కలెక్టర్

రిపోర్టర్: రాజేష్ స్థలం: వరికుంటపాడు

వరికుంటపాడు మండలం రామాపురంలో ఈనెల 29న నిర్వహించనున్న పల్లె పండగ మూడు దశాబ్దాల కార్యక్రమ ఏర్పాట్లను కలెక్టర్ హిమాన్షు శుక్లా పరిశీలించినట్లు అధికారులు తెలిపారు. ఈ సభా వేదికకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ హాజరుకానున్నారు. భారీ జన సమీకరణ కోసం రాష్ట్రవ్యాప్తంగా సుమారు రెండు వేల ఆర్టీసీ బస్సులను కేటాయించారు. ట్రాఫిక్ నియంత్రణ కోసం ప్రత్యేక మార్గాలను ఏర్పాటు చేశామని, పదిహేను వందల మంది పోలీసులతో పటిష్ట భద్రత కల్పిస్తున్నామని ఉదయగిరి సీఐ అంకమ్మరావు పేర్కొన్నారు.