కాంగ్రెస్ పాలనలో తెలంగాణ రైతాంగానికి కష్టాలొచ్చాయంటూ బీఆర్ఎస్ మండిపాటు

రిపోర్టర్: విజయ్ స్థలం: తెలంగాణ

కాంగ్రెస్ తెచ్చిన మార్పు ఇదేనంటూ బీఆర్ఎస్ పార్టీ తీవ్ర స్థాయిలో మండిపడింది. యూరియా బస్తాల కోసం క్యూలైన్లలో కష్టాలు, ఆగిపోయిన పంట కొనుగోళ్లు, రైతు బీమా బంద్, భారీగా అప్రకటిత కరెంటు కోట్లు, మళ్లీ మొదలైన క్రాప్ హాలిడేలతో రైతాంగం నిండా మునిగిందని ఆరోపించింది. మార్పు పేరుతో మాయమాటలు చెప్పి గద్దెనెక్కిన కాంగ్రెస్ పాలనలో మళ్లీ ఆనాటి చీకటి రోజులు వచ్చాయని విమర్శించింది.