జైలు నుంచి విడుదలై మూడేళ్లు: భావోద్వేగ పోస్ట్ పెట్టిన సీఎం చంద్రబాబు

రిపోర్టర్: రమేష్ స్థలం: అమరావతి

వైకాపా హయాంలో అక్రమ అరెస్ట్ తో రాజమహేంద్రవరం జైలులో 53 రోజులు గడిపిన అనంతరం తాను విడుదలైన నాటికి మూడేళ్లు పూర్తయిందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఆ కష్ట సమయంలో తనకు అండగా నిలిచి మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. రాజకీయ జీవితంలో ఆ రోజులు అత్యంత కఠినమైనవని, తెలుగు జాతి చూపిన చొరవ తనను నిలబెట్టిందని ఆయన భావోద్వేగంతో వెల్లడించారు.