అవసరమైతే విలన్ పాత్రలో కూడా నటిస్తానన్న హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: India
నటనకు అవకాశం ఉంటే ఎలాంటి పాత్రనైనా చేయడానికి సిద్ధమని, అవసరమైతే విలన్‌గా కూడా నటిస్తానని మరాఠీ భామ భాగ్యశ్రీ బోర్సే స్పష్టం చేశారు. బిజినెస్ మేనేజ్‌మెంట్ చదివి అనుకోకుండా మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టిన ఆమె, ఆ తర్వాత సినిమాల్లోకి ప్రవేశించినట్లు తెలిపారు. కాంత సినిమా తనకు నటిగా మంచి సంతృప్తినిచ్చిందని, లెనిన్ సినిమా తనకు సక్సెస్ రుచి చూపించిందని తెలిపారు. ప్రస్తుతం శివకార్తికేయన్‌తో కలిసి సెయోన్ చిత్రంలో నటిస్తున్నట్లు ఆమె వెల్లడించారు.