ఎన్నికల సంఘం నిర్ణయంపై శశి థరూర్ ధ్వజం: కోట్లకు పైగా ఓట్ల తొలగింపు
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: ఢిల్లీ
ఓటర్ల జాబితా నుండి కోట్లాది పేర్లను తొలగించడం ద్వారా ఎన్నికల సంఘం పౌరుల ప్రాథమిక హక్కులను హరిస్తోందని కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఢిల్లీలోని రాంలీలా మైదాన్ వేదికగా ఇండియా కూటమి నిర్వహించ తలపెట్టిన భారీ బహిరంగ సభకు ముందు ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఓట్ల తొలగింపు చర్యలను ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించబోమని స్పష్టం చేస్తూ, ఓటర్ల జాబితాను పూర్తిగా ప్రక్షాళన చేయాలని డిమాండ్ చేశారు.