దాచేపల్లిలో అక్రమ అరెస్టులపై వైసీపీ తీవ్ర ఆగ్రహం: కూటమి సర్కార్కు హెచ్చరిక
రిపోర్టర్: రాము
స్థలం: Dachepalli
కూటమి ప్రభుత్వానికి చేతనైతే దాచేపల్లిలో ప్రజాస్వామిక పద్ధతిలో ఎన్నికల్లో పోటీపడాలని, వైసీపీ చైర్మన్ అభ్యర్థి కొప్పుల రవిని అక్రమంగా అరెస్టు చేసి నిర్బంధించడం దుర్మార్గమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. ఎస్కే సుభాని గారు మాట్లాడుతూ, కూటమి నేతల అక్రమ అరెస్టులకు, తప్పుడు కేసులకు భయపడేది లేదని స్పష్టం చేశారు. నేతలు చేస్తున్న తప్పులకి 2029లో ప్రజలు తగిన శిక్ష విధిస్తారని హెచ్చరిస్తూ, స్థానిక ఎన్నికల్లో దమ్ముంటే గెలవాలని సవాల్ విసిరారు.