పెదబయలులో ఉగ్రరూపం దాల్చిన వాగుతో నిలిచిపోయిన రాకపోకలు
రిపోర్టర్: SINDERI KAMESH
స్థలం: పెదబయలు
అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలు మండలంలో అర్నబ్ తుపాన్ ప్రభావంతో పర్థనపుట్టు బ్రిడ్జిపై నుంచి వాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని, వాగు ప్రవాహం తగ్గేవరకు ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని సూచిస్తున్నారు. ప్రమాదకర పరిస్థితుల్లో బ్రిడ్జిని దాటేందుకు ప్రయత్నించవద్దని కోరుతున్నారు.