స్ఫూర్తిదాయకం: ఆఫీస్ బాయ్ నుంచి వీడియో ఎడిటర్గా సంజయ్ ప్రయాణం

రిపోర్టర్: శివ స్థలం: గురుగ్రామ్

గురుగ్రామ్కు చెందిన స్పోర్ట్స్ న్యూట్రిషన్ స్టార్టప్లో ఆఫీస్ బాయ్గా పనిచేస్తున్న సంజయ్, తన కృషితో వీడియో ఎడిటర్గా ఎదిగారని కో-ఫౌండర్ రాజ్ విక్రమ్ గుప్తా వెల్లడించారు. ఆఫీసులో టీలు అందించడం, భోజన ఆర్డర్లు తేవడం వంటి పనులు చేసే సంజయ్.. షూటింగ్ సమయంలో కంటెంట్ బృందానికి సహాయం చేస్తూ ఎడిటింగ్ మెళకువలు నేర్చుకున్నారు. కృత్రిమ మేధ టూల్స్ సాయంతో స్వయంగా ఎడిటింగ్ సాధన చేసి, జూనియర్ వీడియో ఎడిటర్గా ఉద్యోగోన్నతి పొందారు.