అస్సాంలో రైల్వే ట్రాక్ దాటిన ఏనుగుల గుంపు రాజధాని ఎక్స్ ప్రెస్ నిలిపివేత

రిపోర్టర్: వెంకట్ స్థలం: అస్సాం

అస్సాంలోని హోజాయ్ జిల్లా హవాయిపూర్ వద్ద ఏనుగుల గుంపు రైలు పట్టాలు దాటడంతో రాజధాని ఎక్స్ ప్రెస్ రైలును తాత్కాలికంగా నిలిపివేశారు. లంకా రేంజ్ పరిధిలో ఏనుగులు సురక్షితంగా దాటేందుకు అటవీ శాఖ సిబ్బంది, లోకో పైలట్ సమన్వయంతో వ్యవహరించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా, వన్యప్రాణుల రక్షణ కోసం రైల్వే శాఖ తీసుకుంటున్న చర్యలపై ప్రశంసలు వస్తున్నాయి.