ఉక్రెయిన్ ఆధ్వర్యంలో కార్పాథియన్ సీ ఎయిట్ సరికొత్త కూటమి ఏర్పాటు
రిపోర్టర్: విజయ్
స్థలం: World
ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ రష్యా ఉక్రెయిన్ యుద్ధం మరియు ప్రాంతీయ భద్రతా సవాళ్ల నేపథ్యంలో కార్పాథియన్ సీ ఎయిట్ కూటమిని ఏర్పాటు చేశారు. ఉక్రెయిన్లోని ఇవానో ఫ్రాంకివ్స్క్ ప్రాంతంలో జరిగిన ఈ సదస్సుకు ఉక్రెయిన్, రొమేనియా, సెర్బియా, పోలాండ్, స్లోవేకియా, చెక్ రిపబ్లిక్, ఆస్ట్రియా, హంగేరీ దేశాల ప్రతినిధులతో పాటు యూరోపియన్ యూనియన్ నేతలు హాజరయ్యారు. ఈ వేదిక ద్వారా భద్రత, ఇంధనం, రవాణా మరియు ఆర్థిక రంగాల్లో పరస్పర సహకారాన్ని బలోపేతం చేయాలని నిర్ణయించారు.