రంపచోవరంలో ఘనంగా చెకుముకి సైన్స్ సంబరాలు

రిపోర్టర్: Alfa News Desk స్థలం: రంపచోడవరం

జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో పోలవరం జిల్లాలోని 12 మండలాల్లో పాఠశాల స్థాయి చెకుముకి సైన్స్ సంబరాలు అట్టహాసంగా జరిగాయి. విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని, తార్కిక ఆలోచనా విధానాన్ని పెంపొందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు.

ఈ సైన్స్ వేడుకల్లో 8, 9, 10 తరగతులకు చెందిన సుమారు 4000 మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. రంపచోడవరం, అడ్డతీగల, చింతూరు సహా పలు మండలాల్లో విద్యార్థులు తమ శాస్త్రీయ పరిజ్ఞానాన్ని ప్రదర్శించి, సైన్స్ పట్ల తమకున్న ఆసక్తిని చాటుకున్నారు.