పాలమూరు రంగారెడ్డి ద్వారా నీళ్లు ఎత్తిపోసే వరకు పోరాటం ఆగదు
రిపోర్టర్: కృష్ణ
స్థలం: తెలంగాణ
జూరాలలో తొమ్మిది టీఎంసీల నీరు ఉన్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు సాగునీరు అందించడంలో విఫలమైందని మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. ఏపీ ప్రభుత్వం కుప్పంకు కృష్ణా జలాలు తరలిస్తుంటే తెలంగాణలో లిఫ్టులు బంద్ పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా నీటిని ఎత్తిపోసే వరకు రైతుల తరఫున తమ పోరాటం ఆగదని ఆయన స్పష్టం చేశారు.