బ్రిక్స్ సమ్మిట్‌లో మోదీ వెనుక కనిపించిన భారతీయ అధికారి ఎవరో తెలుసా?

రిపోర్టర్: కిరణ్ స్థలం: India

బ్రిక్స్ సమ్మిట్‌లో ప్రధాని నరేంద్ర మోదీ, పుతిన్, జిన్‌పింగ్ లతో పాటు కనిపిస్తూ అందరి దృష్టిని ఆకర్షించిన యువ భారతీయ అధికారి సిద్ధార్థ్ బాబు. విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈస్ట్ ఏషియా డివిజన్ డిప్యూటీ సెక్రటరీగా పనిచేస్తున్న ఆయన, చైనా భాషలో నైపుణ్యం కలిగి మోదీకి అనువాదంలో సహాయం అందించారు. కేరళకు చెందిన సిద్ధార్థ్ సివిల్స్ లో 15వ ర్యాంక్ సాధించారు.