ఇరాన్ రక్షణ మంత్రిగా మెహర్దాద్ అఖ్లాఘీ నియామకం: పార్లమెంట్ ఆమోదం

రిపోర్టర్: సురేష్ స్థలం: టెహ్రాన్

అమెరికాతో తీవ్ర యుద్ధ వాతావరణం నెలకొన్న తరుణంలో ఇరాన్ దేశ కొత్త రక్షణ మంత్రిగా మెహర్దాద్ అఖ్లాఘీ ఎన్నికయ్యారని పార్లమెంట్ అధికారులు తెలిపారు. ఆదివారం జరిగిన ఓటింగ్లో ఆయన నియామకానికి ఎంపీలు భారీ మద్దతు తెలిపారని వారు పేర్కొన్నారు. గత వైమానిక దాడుల్లో అప్పటి రక్షణ మంత్రి మృతి చెందడంతో ఈ కీలక పదవి ఖాళీ అయిందని, క్లిష్ట సమయంలో బాధ్యతలు స్వీకరించడం సవాలుతో కూడుకున్నదని కొత్త మంత్రి స్పష్టం చేశారు.