మున్సిపల్ ఎన్నికలు: ఉద్యోగులకు నవంబర్ 1న వేతనంతో కూడిన సెలవు

రిపోర్టర్: విజయ్ స్థలం: అమరావతి

ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ తేదీ మారడంతో నవంబర్ 1వ తేదీన వేతనంతో కూడిన సెలవును ఖరారు చేస్తూ కార్మిక శాఖ ఉత్తర్వులు జారీ చేసిందని కమిషనర్ గంధం చంద్రుడు తెలిపారు. వాణిజ్య సంస్థలు, దుకాణాల్లో పనిచేసే కార్మికులకు ఈ సెలవు వర్తిస్తుందని ఆయన స్పష్టం చేశారు. అక్టోబర్ 28న జరగాల్సిన పోలింగ్ వాయిదా పడటంతో గత ఆదేశాలను రద్దు చేసి ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.